Tuesday, June 9, 2020

రెండు హల్లులతో పద్యం


రెండు హల్లులతో పద్యం





సాహితీమిత్రులారా!

రెండు హల్లులు ఉపయోగించి కూర్చిన పద్యాన్ని ద్వ్యక్షరి అంటారు.
ఇపుడు రెండు హల్లుల శ్లోకాన్ని చూద్దాం.
దీనిలో "క-" అనే రెండు హల్లులను ఉపయోగించారు
గమనించండి.
ఇందులో హల్లులు రెండే
వాటికి అచ్చులు ఏవైనా ఉండవచ్చు.

కాలేకిలాలౌకికైక
కోలకాలాలకేలల
కలికాకోలకల్లోలా
కులలోకాలిలాలికా

దీని అర్థం-
అలౌకిక = లోకవిలక్షణమైన, ఏక = ముఖ్యమైన,
కోల = ఆదివరాహస్వామియొక్క, కాలాలకే = భార్యవైన,
ఓ లక్ష్మీ,(కాల = నల్లని, అలకే = ముంగురుగలదానా!)
కలి = కలికాలమనే, కాకోల = విషముయొక్క,
కల్లోల = అభివృద్ధిచే, ఆకుల = బాధపడుచున్న,
లోక + అలి = ప్రజాసమూహమును, లాలికా = రక్షించుచున్న,
(త్వమ్) నీవు, కాలేకిల = అపాయసమయమున మాత్రము,
లల = సాక్షాత్కరించి ప్రకాశింపుము.

No comments: