Wednesday, June 17, 2020

య ర ల వ శ ష స హ - లతో పద్యం


య ర ల వ శ ష స హ - లతో పద్యం





సాహితీమిత్రులారా!

హల్లులలో క - వర్గము, చ - వర్గము,ట - వర్గము,
త - వర్గము,ప - వర్గము అని 5 వర్గాలు.
క - మొదలు మ - వరకు ఉన్న హల్లులు కాకుండా
మిగిలిన య ర ల వ శ ష స హ - లను (హల్లులను)
ఉపయోగించి పద్యం కూర్చడం
దీన్నే వర్గపంచకరహితము అంటాం

హార,హీర, సారసారి, హారశైల, వాసవో
ర్వీరుహా, హిహార, శేషవేషహాసలాలస
శ్రీరసోరుయాశసాంశుశీల వైరివీరసం
హార! సారశౌర్యసూర్య హర్యవార్యసాహసా
                                            (కావ్యాలంకారసంగ్రహము 5-245)

(హీరము - మణి, సారసారి - చంద్రుడు,
హారశైలము - కైలాసము, అహిహారుడు - శివుడు,
యాశసాంశుశీల - కీర్తికాంతులచే ఒప్పువాడు,
సూర్యహర్యవార్య సాహసా - సూర్యుని అశ్వములచేతను
వారింపరాని (చొఱవగల) సాహసము కలవాడా)

ఈ పద్యంలో క - మొదలు, మ - వరకు గల హల్లులు
ఏవికూడ వాడలేదు
కావున
ఇది వర్గపంచకరహిత పద్యమైనది.
ఇది శబ్దచిత్రంలోని ఒక రకము.

No comments: