Thursday, March 5, 2020

పెదిమలు తగులుతూ - నాలుక కదలని పద్యం


పెదిమలు తగులుతూ - నాలుక కదలని పద్యం




సాహితీమిత్రులారా!

ఓష్ఠ్యములు అంటే పెదిమలు తగిలే విధంగా పలికే అక్షరాలు
అంటే పెదవుల నుండి పుట్టే అక్షరాలు.
 వీటితోను నాలుకతాకు లేకుండా కూర్చిన పద్యం ఇది.
"ఆయలూరు కందాళయార్య" విరచిత
"అలంకారశిరోభూషణే "
శబ్దాలంకారప్రకరణంలోనిది ఈ శ్లోకం.
చూడండి నాలుక కదులుతుందేమో!

భవభామా భావగాహ బహుభామా మవాభవ
మమ భోభవభూమావ భవభూపా వభూమహ 

(పార్వతీదేవి యొక్క హృదయమందు చేరినవాడా(శ్రీరామనామ రూపంతో
ఆమె హృదయమందున్నవాడు) అధిక తేజస్సంపన్నుడా! సంసారగంధ గ్రహితుడా
శ్రీ భూవల్లభా! సంసార మండలంలో కలిగిన పాపాధిత్యాను నశింపచేయువాడా!
నన్ను రక్షించు)

No comments: