Sunday, March 1, 2020

చిత్రకావ్య కౌతుకమ్


చిత్రకావ్య కౌతుకమ్




సాహితీమిత్రులారా!

రామరూప్ పాఠక్ సంస్కృతభాషలో పేరుపొందిన కవి. సంస్కృత సాహిత్యాన్ని, భారతచరిత్ర సంస్కృతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి రామరూప్ పాఠక్. ఈయన 1891లో బీహార్ లోని షహాబాద్ లో మంచి చదువు సంస్కారం ఉన్న కుటుంబంలో జన్మించారు.
చిత్రకావ్య కౌతుకమ్ కు 1967లో సాహిత్య అకాడమీ అవార్డు
లభించింది. చిత్రకవిత్వ విధానంలో చేసిన ప్రయోగాలకు ఈ పుస్తకం పేరుపొందింది. ఆధునికయుగంలో చిత్రకావ్య వైతాళికుడుగా కీర్తిని పొందాడు పాఠక్.  చిత్రకవిత్వంలో అంతకు ముందున్న గ్రంథాలకన్న
అభివ్యక్తిలోనూ, ఇతివృత్తం విషయంలోనూ విశిష్టమైనదిగా విమర్శకుల మన్ననలు పొందింది. ఈ గ్రంథంలో 55 రకాల చిత్రబంధాలున్నాయి.
ఈ గ్రంథంలో మూడు ఖండాలున్నాయి. మొదటి ఖండంలో చిత్రకావ్య భూమికను, రెండవ ఖండంలో చిత్రకావ్య మూల గ్రంథాలను గురించి వివరిస్తూ 55 బంధాలను వివరించారు. మూడవ ఖండంలో రెండు అనుబంధాలున్నాయి. వాటిలో మొదటి అనుబంధంలో పాఠక్ కృత
లఘుకృతులు ఇచ్చాడు. రెండవ ఖండంలో సమస్యాపూరణలు కూర్చారు.
ఇక్కడ బంధం గమనించండి-

No comments: