"దామోదర రదమోదా" (పాదభ్రమక పద్యం)
సాహితీమిత్రులారా!
ఒక పద్యం లేదా శ్లోకం లోని పాదాలు మొదటినుండి
చివరకు చదివినా చివరనుండి మొదటికి చదివినా
ఒకలాగే ఉంటే దాన్ని పాదభ్రమకం అంటాం.
పాదభ్రమకానికి ఉదాహరణగా ఈ పద్యం చూడండి-
ఇది "విక్రాల శేషాచార్యు"లవారి
"శ్రీవేంకటేశ్వరచిత్రరత్నాకరం" ఉత్తర భాగంలోనిది.
దామోదర రదమోదా
రామా తతరా జయ యజరా తతమారా
రామా జని నిజ మారా
భూమా తతభూమతతమ భూతత మాభూ
ఇది ప్రతి పాదం ఎటునుంచి చదివినా ఒకలాగే ఉంటుంది గమనించండి -
(ర - జంకును, ద - ఖండించువాడా, మోదా - ఆనంద స్వరూపుడా
తత - విస్తృతమైన, రా - బంగారు కలవాడా, తత - అధకమైన,
మా - బుద్ధికి, రా - శాలయైనవాడా, రామా - లక్ష్మి వలన, జని - పుట్టుక కల, నిజ - నిత్యుడైన, మారా - కాముడు కలవాడా, భూమా - విరాట్ స్వరూపుడా, తత - పెద్దదియగు, భూ - భూదేవికి, మతతమ - మిక్కిలి ప్రియుడా, భూ - భూమివలె, తత - గొప్పదియగు, మా - లక్ష్మికి, భూ - స్థానమైనవాడా, దామోదర, జయ - జయించుము.)
No comments:
Post a Comment