Saturday, March 28, 2020

రాముడు బాణం వదలితే రావణుడు బాణం వదిలాడా?



రాముడు బాణం వదలితే రావణుడు బాణం వదిలాడా?





సాహితీమిత్రులారా!

ఈ శ్లోకాన్ని చూచి అర్థం తెలుసుకొన ప్రయత్నించండి.

సమరే హేమరేఖాంకమ్ బాణం ముంచతి రాఘవే
న రావణోపి ముముచే మధ్యే రీతి ధరం శరమ్

యుద్ధంలో రాముడు సువర్ణ రేఖాంకితమైన
బాణాన్ని వదలగా (ప్రయోగించగా)
ఆ రావణుడూ మధ్యలో
ఇత్తడి బాణమును విడిచెను - అని భావం

ఇది సరైనదేనా?  రాముడు బాణం వదలితే రావణుడు బాణం వదిలాడు
ఇదేమి విశేషం ఇది కాదు
బాగా ఆలోచించాలి.
దీనిలోని గమ్మత్తు ఏమిటంటే
మధ్యే రీతి ధరం శరమ్ అంటే రీ కారము మధ్యలోగల శరం అంటే శరీరం -
శరీరం - లో
రీ మధ్యలో ఉంది
అంటే రావణుడు శరీరం వదిలాడు - ఇది సరైన భావం.

No comments: