Monday, December 26, 2022

నామగోపనచిత్రం

నామగోపనచిత్రం




సాహితీమిత్రులారా!


 గణపవరపు వేఃకటకవిగారు రచించిన  ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసం 

చిత్రకవిత్వకళావిలాసమందిరం  ఈ కావ్యంలో ఉన్నంత చిత్రకవిత్వం

భారతీయభాషలలోనిమరేకావ్యంలోనూ  లేదని  ఈ కావ్యం గురించి పరిశో

ధించి డాక్టరేట్ పట్టా పొందిన మాన్య ఆత్మీయులు డా.ఏల్చూరిమురళీధర

రావుగారి మాట.    ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసాన్ని   నా   విద్యార్థి దశనుంచి

చదువుతున్నాను.కారణం నాకున్నూ చిత్రకవిత్వం మీద.మక్కువ ఎక్కువ

కనుకనే.     చిత్రకవిత్వంలో నామగోపనచిత్రం అనేది ఉంది.  అంటే, పద్యంలో ఒక

పద్ధతిగ,కవి తాననుకున్న  ఒక పేరును గోప్యంగ ఉండే విధంగ పద్యరచన చే

స్తాడు.ఉదాహరణకు గణపవరపువేం కటకవి రచించిన నామగోపన పద్యా లలో ఒకటి----


.భువనజఠర!జయసన్నుత!

  గవాధిపా!ధన్యకలిత-కారుణ్య!రమా

  ధవ!పరమపురుష!తీవ్ర రి

  పువిపాలమహోవిశాలా!భుజగధరప తీ!

  ఈ పద్యం వేంటేశ్వరస్తుత్యాత్మకం.

అర్థం తెలుసు కుందాం----

భువనజఠర=సమస్తలోకాలనూకడుపులో ఉంచుకున్న విశ్వరూపా!జయ

సన్నుత=జయ అంటే మహాభారతం,

మహాభారతంలో పొగడబడినవాడా!

గవాధిపా=భూదేవీనాయకా!,ధన్యకలి

త కారుణ్యా!=నిన్ను ఆశ్రయించిన ధన్యులయందు కరుణగలవాడా,రమా

ధవా=సిరిమగడా!,పరమపురుష!=పు

రుషోత్తమా,తీవ్ర=తీవరించిన,రిపు=శ

త్రువులను,విపాల=మట్టుపెట్టే,మహః

విశాల!=అధికపరాక్రమంకలవాడా!,భు

జగధరపతీ= శేషశైలమందు  వెలసిన

స్వామీ!  

      పద్యంలో ఏడుకొండల స్వామికి ప్రతీకలుగా ------

భువనజఠర!

జయసన్నుత!

గవాధిపా!

ధన్యకలితకారుణ్యా!

రమాధవా!

పరమపురుష!

తీవ్రరిపు విపాలమహోవిశాల!

అంటూ ఏడు సంబోధనలు ఉన్నాయి.

ఆ ఏడు సంబోధనలలోని తొలి అక్షరా

లను వరుసగా కూర్చితే ---

భు-జ-గ-ధ-ర-ప-తీ! అనే పేరు ఉంటుంది.ఇదే నామగోపనం.

ఈ నామమే  పద్యం చివరన సంబోధ నాత్మక మకుటంగా కూడ ఉంది.

           వేంకటపతయేనమః

          స్వామిపేరు&కవిపేరు

వైద్యం వేంకటెశ్వరాచార్యుల వారి సౌజన్యంతో 

No comments: