Saturday, December 24, 2022

మహానాగ బంధం

 మహానాగ బంధంసాహితీమిత్రులారా!

డా. ఏల్చూరి మురళీధరరావుగారు

కూర్చిన   చిత్రభారతము కావ్యం 

భీష్మపర్వము నుండి

మహానాగ బంధం గమనించండి-


సీ. శ్రీమహావిష్ణుని సిద్ధసంకల్పు స

                   ర్వంసహానన్తర్ధవర్ధమాను

     మానుతు ధర్ము ధర్మాధ్యక్షు నందనం

                   దాదిత్యు గోవిందు నావిలాసు

     వాసవు సత్యు నిర్వాణు సాణుశ్రీశు

                   భాను చలాచలమానవిశ్వ

     శాశ్వతైకవ్యాస సాధ్యర్తు గోప్త గ

                   దాధరు ధన్యదు ధామ సామ

గీ. శ్రీరమేశుని సువ్యాసు శ్రీనిలయు ని

     యుక్తు సుశ్రద్ధధానతాసక్తు దిశు మ

     హామఖాధ్యక్షు వాయువాహను సురమ్యు

     భక్తభద్రదు ప్రేముడిన్ ముక్తి గనుమ

బంధం-No comments: