ఆశుకవితపై మొహం మొత్తిందా - 2
సాహితీమిత్రులారా!
సావిత్రీ పరిణయ కర్త
దంతుర్తి దత్తాత్రేయకవి
గ్రంథ పీఠికలో కూర్చిన
ఆశుకవితా నిరసన పద్యాలు
గమనించండి-
నిరలంకృతియునునవరస
వరపాక ప్రక్రియానివారిత శయ్యా
విరహ కృతినాథహీనము
ధరనాశుకవిత దనరు విధవ కాంతవలెన్
ఆశుకవితయందు హావభావాదులు
శ్లేషకల్పనలును జేరకుంట
జేసి కవుల శక్తి వాసి దొలంగును
నటుల గామి గీర్తి యధిక మగును
ఆశుకవిత్వంబందున
సౌశబ్ద్యంబుండదెపుడు సభలో దానన్
బ్రాశస్త్యహాని గలుగదె
యీశసముండైన వానికెప్పుడు భువిలోన్
ఆలోచించని కవనం
బాలోచించంగవలయు నందఱు విబుధుల్
ఆలోచించిన కవనం
బాలోచించంగవలయు నాలోచించన్
స్వవనము కవనము కవులకు
సువిచారత కలిగెనేని శోధింపంగన్
స్వవనము స్వవనము కవులకు
సువిచారత కలిగెనేని శోధించంగన్
రసము లేనట్టి కవిత వ్యర్థంబుగాదె
ఫలము రీతిని గూపంబు పగిది గాను
రసము కలిగిన సుకవిత(ప్రాభవమ్ము)
గలిగియుండును ధరణి శ్లాఘ్యంబు గాదె
మండనమిశ్రునియంతటి
పండితవరునకు(ని)యతియె భంగంబయ్యెన్
కుండలిపతులా మఱి యా
ఖండలగురులా దలప కవు లాధునికుల్
No comments:
Post a Comment