వీరెవరో చెప్పండి?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు కత లోని వారెవరో చెప్పండి?
కడవ బుట్టిన కమనీయ చరితుడు
పుట్టి బుట్టినట్టి పుణ్యతముడు
పూరి నుదయమైన వీరాధివీరుడు
ఎవరు తెల్పుడీ సుధీంద్రులార
సమాధానం-
కడవ బుట్టిన కమనీయ చరితుడు - అగస్త్యుడు
పుట్టి బుట్టినట్టి పుణ్యతముడు - వాల్మీకి
పూరి నుదయమైన వీరాధివీరుడు - కుమారస్వామి
పతి యొకడుకాదు కాదామె పడుపు కత్తె
ఎవరి కడుపున బుట్టెనో ఎరుగలేము
ఆమె నామంబు బరగు మూడక్షరముల
సహన భావనరాజిల్లు జానయెవతె
సమాధానం - ద్రౌపది
No comments:
Post a Comment