Thursday, April 9, 2020

లోకాలంటే? లోకాలు......... వివరణ


లోకాలంటే?  లోకాలు......... వివరణ




సాహితీమిత్రులారా!
Journey Of Space Will Be Reality - अंतरिक्ष की सैर ...
కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని గారి
విశ్వమీమాంస సత్యలోక ప్రకరణమ్ నుండి

లోకాలంటే ఏమిటి?
లోకాల వివరణ తెలుసుకుందాం
లోకాలు ఊర్థ్వలోకాలని, అథోలోకాలని రెండువిధాలు
వీటిలో ఊర్థ్వలోకాలను ఈ విధంగా వివరించారు-

పరమాత్మను సత్యలోకమని
శుద్ధాకాశమును తపోలోకమని,
అంతరిక్షాకాశమును జనోలోకమని
సూర్యుని మహోలోకమని,
పుణ్యవంతులకు భోగస్థానమైన 
చంద్రుని స్వర్లోకమని,
వ్యక్తవాయుతరంగాల గతికి స్థలమైనదానిని 
భువర్లోకమని,
భువిని భూలోకమని పిలుస్తారు.

పూర్వఋషులు జనోలోవాసులను మరుత్తులని కీర్తించారు.
మరోవిధంగా వీరిని ప్రమథగణములని, రుద్రగణములని, 
సిద్ధగణములనీ కీర్తించారు.

మహాలోక ప్రజలను ఆదిత్యులని, 
సాధ్యగణములని రెండు విధాలు.

స్వర్లోక ప్రజలను గంధర్వ, 
పితృగణములని రెండు విధాలు

భువర్లోకవాసులను పిశాచగణములని పిలుస్తారు

భూలోకవాసులను నరులని పిలుస్తారు.

స్వర్లోకమును మొదట పొందిన 
గంధర్వులను దేవతలని పిలుస్తారు.
మొదట పొందిన పితృగణములను 
వసువులని పిలుస్తారు.

No comments: