Sunday, April 5, 2020

హిందీలో విలోమకావ్యం


హిందీలో విలోమకావ్యం




సాహితీమిత్రులారా!
Śrī Rāma & Kṛṣṇa
ప్రపంచంలో విలోమకావ్యాలు సంస్కృతంలో అదీ రెండు వున్నాయని
అందరికి తెలుసు. కాని హిందీలో వుందని చాలామందికి తెలియదు.
1. రామకృష్ణవిలోమకావ్యం(సంస్కృతం)  దైవజ్ఞ సూర్యకవి కృతం
2. రాఘవయాదవీయం(సంస్కృతం)     వేంకటాధ్వరి
ఇక మూడవది - శ్రీరామకృష్ణ కావ్యం
12 రకాల ఛందస్సులతో 50 పద్యాలతో హిందీ(వ్రజభాష)లో కూర్చనడినది.
కూర్చిన వారు హృషీకేశ చతుర్వేది.

ఛందస్సు పేరు        గణాలు
1. ఇంద్రవ్రజ         తతజగగ
2. మౌక్తికదామ         జజజజ
3. శ్యేనికా             రజరలజ
4. తోటక              సససస
5. మోదక             భభభభ
6. స్త్రగ్విణి            రరరర
7. దోహా
8. తూణక             రజరజర
9. సమానికా           రజగ
10. మనోరమ          రసజల
11. పీయూషవర్ష        16 మాత్రలు చివర వ - గణం
12. సంయుత          సజజగ

మొదటి శ్లోకం -
రామపరంగా
रामा हरैँ कष्टइ तीव्र-धारा
हैं सोपमी, सत्य निरीह जो हैं
రామా హరై కష్టఇ తీవ్ర-ధారా
హైఁ సోపమీ, సత్య నిరీహ జో హై


కృష్ణపరంగా - పై శ్లోకాన్ని కుడినుండి ఎడమకు వ్రాయగా

राधा-व्रती इष्ट करैं हमारा
हैं जो हरी, नित्य समीप सोहैं
రాధా-వ్రతీ ఇష్ట కరైఁ హమారా
హైఁ జో హరీ, నిత్య సమీప సోహైఁ





No comments: