Saturday, March 4, 2023

నాలుగక్షరాల నాలుక కదలని పద్యం

 నాలుగక్షరాల నాలుక కదలని పద్యం




సాహితీమిత్రులారా!



నాలుగక్షరాలతో కూర్చినది

చదివితే పెదాలు తగిలేది

నాలుక కదలని పద్యం ఇది-

దీనిలో ప,బ,భ,మ  అనే వ్యంజనాలతో కూర్చబడిది

పోకూరి కాశీపతిగారి సారంగధరీయంలోనిది ఈ పద్యం

గమనించండి - ఆస్వాదించండి-

మామమామపాప భీమమౌ ముప్పాపి

పాపమేపు మాపి బాముఁ బాపి

భూమిఁ బబ్బ మబ్బఁ బేము మమ్మోమమి

మేము బోము భామ మేమి భీమ

                                                              (సారంగధరీయము - 2- 127)

దీన్ని పెదవులతో పలుకుతాము కావున సోష్ఠ్యములతో కూర్చినది అంటాం.

అలాగే నాలుగక్షరాలతో కూర్చినది కావున చతురక్షరి అంటాము

అలాగే చదివేప్పుడు నాలుక కదలదు కావున అచలజిహ్వ అంటాం

దీనిలో ఇన్ని ప్రత్యేకతలున్నాయి 

దీన్ని కూర్చిన పోకూరి కాశీపతిగారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి

No comments: