Wednesday, June 30, 2021

ఇదీ దాంపత్యమే

 ఇదీ దాంపత్యమే
సాహితీమిత్రులారా!మనం గమనిస్తూనే ఉంటాం రకరకాల వ్యక్తులను, రకరకాల భార్యాభర్తలను.
వారిలో ప్రతిదానికీ కీచులాడుకొనేవారూ కనబడుతూ ఉంటారు.
వారి దాంపత్యాన్ని మార్జలదాంపత్యం అంటూ ఉంటారు.
అలాంటి ఒక దంపతుల సంభాషణ
ఈ శ్లోకంలో కవి చూపాడు చూడండి.

ఆ: పాకం నకరోషి పాపిని కథం? పాపీ త్వదీయ: పితా!
రండే జల్పసి కిం ముధా కలహిని? రండా త్వదీయ స్వసా!
నిర్గచ్ఛస్వ హటాన్మదీయ భవనాత్! నైదం త్వదీయం గృహం!
హా! విశ్వేశ్వర దేహిమేద్య మరణం! శప్పం మదీయం గతమ్!భర్త - పాపాత్మురాలా! వంట చెయ్యలేదా?
భార్య - నీ తండ్రి పాపాత్ముడు!
భ.- రండా! ఏమి ప్రేలుచున్నావు?
భా.- నీ చెల్లెలు రండ.
భ. - నా యింటినుండి వెంటనే పొమ్ము!
భా. - ఇది నీ యిల్లు కాదు!
భ. - హా పరమేశ్వరా నాకు మరణము నిమ్ము!
భా.- నా వెంట్రుక పోయినదనుకొందును.

No comments: