ఇవి తెలుగు పదాలేనా?
సాహితీమిత్రులారా!
ఈ శ్లోకం అపభ్రంశ శ్లోకం
కవిత్వంలోని సాంప్రదాయాలు,
కవిసమయాలను గుర్తించి రచనలు చేయాలి
అలా చేయకపోతే ఏలా ఉంటుందో!
ఈ కవి చమత్కరిస్తూ చెప్పిన
శ్లోకం ఇది
చూడండి-
అస్థివత్ బకవచ్చైవ
చల్లవత్ తెల్లకుక్కవత్
రాజతే భోజ తే కీర్తి
పునస్సన్యాసిదంతవత్
(ఓ భోజమహారాజా! నీ కీర్తి ఎముకలలా, కొంగలా,
మజ్జిగలా, తెల్లకుక్కలా, మళ్ళీ మాట్లాడితే సన్యాసి
పండ్లలా రాజిల్లుతున్నది - అని భావం.)
దీనిలోని ఉపమానాలన్నీ హీనోపమానాలే.
ఇటువంటివి వాడకూడదు.
స్త్రీ ముఖం గుండ్రంగా ఉంటే చంద్రబింబంతో పాల్చాలికాని
బండి చక్రంతో పోల్చకూడదుకదా!
అనటానికి ఉదాహరణగా ఈ శ్లోకం చెప్పుకోవచ్చు.
ఆ విషయాలను పక్కనపెడితే
ఇందులోని పదాలు చాలావరకు
మన తెలుగు పదాల్లా ఉన్నాయి.
కావున ఇది భాషాచిత్రంగా చెప్పవచ్చు.
No comments:
Post a Comment