Tuesday, January 26, 2021

నాలుక కదిలి కదలని పద్యాలు

 నాలుక కదిలి కదలని పద్యాలు



సాహితీమిత్రులారా!



శ్రీనివాస చిత్రకావ్యంలోని పద్యాలు

చదివేప్పుడు నాలుక కదలని పద్యాలు-

కాయముగేహము  వమ్మగు

మాయకు మోహింపబోకు మక్కువగ మహో

పాయం బూహింపుము వే

బాయగ పాపంబు మంకుభావమవేగా


భోగిపభుగ్వాహ మహా

భాగా విభవైకభోగ బావుకభావా

మేఘోపమాంగభూపా

బాగుగమముగావువేగ బాపాభావా


నాలుక కదిలీ కదలని పద్యం-

ఓ తాపస పరిపాలా

పాతక సంహారా వీర భాసాహేశా

భూతపతిమిత్ర హరి ముర

ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా

                                                                వీటిని చదివి గమనించండి.

No comments: