Sunday, January 10, 2021

గిరిబంధం /శైలబంధం

 గిరిబంధం /శైలబంధం





సాహితీమిత్రులారా!

శ్రీకొడవలూరు రామచంద్రరాజు కృత
మహాసేనోదయము నందు గల
గిరిబంధము పద్యం చూడండి-

గిరిబంధములో మొదట 1 అక్షరము,
తరువాత 3 అక్షరములు, 5 అక్షరములు,
7 అక్షరములు, 9 అక్షరములు, 11 అక్షరములు,
11 అక్షరములు ఉండునట్లు కూర్చబడిన చిత్రములో
చూపిన విధంగా వ్రాసిన గిరిబంధము ఏర్పడును.
ఈ విధంగా వ్రాయడం వలన పైనుండి మధ్యలో
కవి పేరుగాని, ఇష్టదేవత పేరుగాని కవి కూర్చును
ఈ పద్యంలో కొడవలూరి రామచంద్రరాజు గారు
తన ఇష్టదైవమైన శ్రీరామలింగేశ్వరుని
నమస్కరించిన విధంగా కూర్చారు.

శ్రీహీరాన్గద కమలద
వాహ నిలింపార్చితాంఘ్రి వనజాగసుత 
స్నేహ మునినిచయవంద్యా
దేహజగర్వాద్రికులిశ దేవసుచరితా



శ్రీ
హీరాన్గ
ద కలద
     వాహ నిలింపార్చితాం
ఘ్రి వనజాసుతస్నేహ 
మునినిచయవంద్యాదేహజగ
                          ర్వాద్రికులిశ దేవసుచరితా


No comments: