కవిచమత్కారం
సాహితీమిత్రులారా!
కృష్ణదేవరాయల వాకిటిని కాపలాకాయు
తిమ్మనికి రాజుగారు ఎప్పుడో మంచి
సేవలకుగాను ఒక సేలువా ఇచ్చాడట.
దాన్ని కప్పుకొని తిరుతున్న సమయంలో
దాన్ని తెనాలి కామకృష్ణుడు చూచాడట.
ఎలాగైనా దాన్ని కాజేయాలని ఎదురు చూస్తున్నాడు.
ఒకరోజు అతనికి ఒక పద్యమైనా కృతి తీసుకోమని సలహా ఇచ్చాడు.
అది ఊరకే ఇవ్వరుకదా అని అనగా
పద్యంలో నాలుగు పాదాలు నలుగురిని అడుగు
అప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వకుండా
సరిపోతుందని ఉపాయం చెప్పాడు.
అది సరైనదేనని మరునాడు సభలోకి
వెళ్ళే కవులను తనకోరిక చెప్పి
పెద్దనను మొదట అడిగాడు దానికి
ఆయన ఒక చరణం చెప్పాడు
తరువాత భట్టుమూర్తి రెండవ చరణం చెప్పాడు,
మూడవ చరణం తిమ్మన చెప్పాడు
నాలుగవచరణం తెనాలిరామకృష్ణుడు చెప్పాడు
ఆచరణంతో చివరకు ఆ శాలువా మారుపలక్కుండా ఇచ్చాడట.
ఆ పద్యం-
పెద్దన - వాకిటికావలితిమ్మా!
భట్టుమూర్తి- ప్రాకటమగు సుకవివరుల పాలిటి సొమ్మా!
తిమ్మన - నీకిదె పద్యము కొమ్మా!
రామకృష్ణుడు - నా కీ పచ్చడమె చాలు నయమున నిమ్మా!
ఈ పద్యం నలుగురు చెప్పినా
అంత్యనుప్రాసలో చెప్పడం గమనార్హం.
No comments:
Post a Comment