పద్యభ్రమకము(అనులోమ విలోమము)
సాహితీమిత్రులారా!
పద్యభ్రమకమంటే పద్యం పైనుండి క్రిందికి
క్రిందినుండి పైకి ఎలా చదివినా పద్యం ఒకలాగే
మారకుండా ఉండడటం. దీన్నే అనులోమ పద్యం
(పైనుండి క్రిందికి చదివే పద్యం), విలోమ పద్యం
(క్రిందినుండి పైకి చదివే పద్యం)
రెండు ఒకలాగే ఉంటే దాన్ని
అనులోమ విలోమ పద్యం అంటారు.
ఇక్కడ బోడి వాసుదేవరావుగారి చిత్రమంజరి
నుండి ఈ రకపు పద్యం చూద్దాం-
సరోజ వృత్తం -
మార! ధీర! రధీరమా!
సారధీరసభారసా!
సారభాసరధీరసా!
మా! రధీర! రధీరమా!
మార(మా - ర) - లక్ష్మీదేవియు, మన్మథుడును గలవాడా
ధీర - స్వతంత్రుడా
రధీరమా - (ర-ధీ-రమా) - చురుకైన బుద్ధికలవాడా
సారధీరసభారసా - శ్రేష్ఠులైన రసజ్ఞులుగల సభాస్థలి గలవాడా
సారభాసరధీరసా - సార-భాస-ర-ధీర-సా)న్యాయముతో ప్రకాశించుచున్న
నిపుణులైన విద్వాంసుల యొక్క ధ్యానముగలవాడా
మా - (మ-అ) - బ్రహ్మకు హేతువైనవాడా
రధీర (ర-ధి-ఇర) - త్యాగమునకు స్థానమైన వాక్కులు గలవాడా
రధీరమా(ర-ధీర-మా)- మనోహరుడు, సాహసికుడుఅయిన చంద్రుడు కలవాడా
2 comments:
కవివరులకు నమస్సులు. శ్రీ బోడి వాసుదేవరావు గారి "చిత్రమంజరి" పుస్తకం ఎక్కడ లభించునో చెప్ప మనవి🙅
వి.వి.సత్యనారాయణగారికి నమస్కారం
వాసుదేవరావుగారి చిత్రమంజరి ఎక్కడదొరికేది నాకు తెలియదండి
నేను ఒక మిత్రుడి ద్వారా జిరాక్స్ కాపీ దొరికించుకున్నాను.
Post a Comment