Saturday, April 15, 2023

రీతికావ్యాలు

 రీతికావ్యాలు 




సాహితీమిత్రులారా!


హిందీ సాహిత్యంలో 17 - 18 శతాబ్దాలలో వెసిన శృంగార ప్రధామై, అలంకారిక శైలి, వర్ణనా బాహుళ్యం గల రచనలను రీతి కావ్యాలని చెబుతారు వీటినే రీతిశృంగార కావ్యాలు అని కూడ అంటారు. వామనుడు మొదలైన సంస్కృత అలంకారికులు చెప్పిన శైలీపరమైన రీతికి, రీతి కావ్యాలకు పోలికలేదు. ఇవి సంస్కృత, ప్రాకృతాలలో ఆస్థానకవులు ప్రభుల మనోల్లాసంకోసం రచించిన కావ్యాలవంటివి. తెలుగు ప్రబంధాల వంటివి. ఈ రీతి కావ్యాలు నాయికా నాయకులకు భేదాలతోను రసాద్యలంకార వర్ణనచేతను నిండి ఉండటంచేత, సంస్కృతలక్షణాలకు లక్ష్యాలుగా రచించినవి కావడం చేత, ప్రత్యేకమైన రచనా విధానం కల్గి ఉన్నందు వల్ల, రామచంద్రశుక్ల రీతి కావ్యాలని పేర్కొన్నారు. కొందరు వీటిని రీతిశృంగారకావ్యాలని నిర్వచించారు. తిరిగి ఈ రీతికావ్యాలను రీతిబద్ధకావ్యాలని, రీతిసిద్ధకావ్యాలని రెండువిభాగాలుగా చేశారు. కవి ఏదో ఒక అలంకారాన్ని మాత్రమే ప్రయోగిస్తూ వ్రాయబడినవి రీతిబద్ధకావ్యాలు.

రీతిసిద్ధకావ్యాలు అలాకాక కవి ఇష్టానికి రసవదలంకారాలతోవ్రాయబడిన వాటిని రీతిసిద్ధకావ్యాలంటారు.  రీతికావ్యాలు చాలా వరకు ముక్తపదగ్రస్త శైలిలో సాగటం గమనించదగింది.రీతికావ్యాల పంథాలో లేని ఇతర రచనలను రీతిముక్తకావ్యాలని అంటారు. ఈ కావ్యాలు శృంగారరస ప్రపధానమైగాథాసప్తశతివలె కథాత్మంగా సాగిపోతుంటాలి. నీహారీలాల్ వ్రాసిన సత్ సాయ్ రీతికావ్యలక్షణాలన్నీ కలిగిన కావ్యం రీతి కవులలో కొందరు ప్రముఖులైనారు

No comments: