Friday, July 22, 2022

మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం-2

 మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం-2




సాహితీమిత్రులారా!



మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం.

మల్యాల గుండయ క్రీ.శ. 1272లో వేయించిన 

బూదపూరు శాసనంలోని 16వ శ్లోకం

వృత్యనుప్రాస పద్యం గమనించండి-


సా భారతి నియమితా రసనాగ్ర భాగే సా కోమలాచ కమలా నయనాంచలేచ

సా నిర్మలలలిత తత్త్వ విలాస లీలా కలాప కలితా ఖలు యేన చిత్తం


దీనిలో కోమలా, కమలా, నిర్మల, లలిత, కలా, విలాస, 

లీలా, కలాప, కలితా, ఖలు - ఈ పదాలలో లకారం 

అనేకమార్లు పునరుక్తం కావటం 

వల్ల ఇది వృత్యనుప్రాసం అవుతున్నది.


గుండయ రసనాగ్రంలో అంటే నాలుకపై

భారతి(సరస్వతీదేవి), 

కమలం వంటి కనుకొసలలో 

కోమల(లక్ష్మీదేవి),

చిత్తంలో నిర్మల(పార్వతీదేవి)

 ఈ మంగ్గురు లలిత, తత్త్వ, కళావిలాస లీలా

 కలాపంలా కనిపించారు - అని అర్థం.


No comments: