Sunday, February 21, 2021

మూడక్షరాల సమాధానాలు చెప్పండి

 మూడక్షరాల సమాధానాలు చెప్పండి




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం చూచి సమాధానాలు చెప్పండి-

దివ్యసంఘములైతతేరిచూడఁగలేని

              కుంభజుదేనిచేఁ గూల్చె నరుఁడు

ప్రతినఁదీరకయుంటఁ బ్రాణావశిష్టుఁడౌ

              కౌంతేయు దేనిచేఁగాచెను హరి

సరసిజవ్యూహాన శత్రుసైన్యంబుల 

              నభిమన్యుఁడెందుచే నడలఁగొట్టె

కౌరవ్యయోధులఁ గపటకేళినటించి

              తేజమున్  దేనిచేఁ దీసె హరియు

ధర్మపథ మెందుచేఁ జేరె ధర్మరాజు

యన్నిటికిఁజూడ మూడేసి యక్షరములు

మధ్యకడ యక్షరములు, సమానమన్ని

కూర్చె గంగాధరము తెల్సికొండు దీని


షరతులు -

ప్రతిప్రశ్నకు సమాధానం మూడక్షరాలుండాలి మరియు మధ్య చివరి అక్షరాలు అన్నిటికి సమానంగా ఉండాలి.


సమాధానాలు -

భక్తిచే, యుక్తిచే, శక్తిచే, రక్తిచే, ముక్తిచే

షరతులు సరిపోయినవికదా


No comments: